IPS అధికారిణిని వేధించిన ఎన్నారై అరెస్ట్...

Punjab: నిందితుడు అమెరికాలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు..

Shireesha
Published on: 11 May 2022 3:36 PM IST
America NRI Molestation Punjab IPS Trainee | Live News Today
X

Representational Image

Punjab: IPS అధికారిణిని అభ్యంతరకర మెసేజ్‌లతో ఓ ఎన్నారై వేధింపులకు గురిచేస్తుండడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన ఘల్ రాజు.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా పంజాబ్ మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఘల్ రాజు తన స్వస్థలమైన పంజాబ్‌కు వచ్చాడు.

కాగా మహిళా ఐపీఎస్ అధికారిణి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలుసుకుని నగరానికి వచ్చాడు. హెచ్ఆర్డీ లోపలకువెళ్లి మహిళా ఐపీఎస్ అధికారిణిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘల్ రాజుని పోలీసులు అరెస్టు చేశారు.

Shireesha

Shireesha

Next Story