జవాన్ల భౌతిక కాయాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం

Ambulance: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలు తరలిస్తున్న అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది.

Arun Chilukuri
Published on: 9 Dec 2021 6:11 PM IST
Ambulance Carrying Jawans Dead Bodies Has Minor Accident
X

జవాన్ల భౌతిక కాయాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం

Ambulance: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలు తరలిస్తున్న అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. జవాన్ల భౌతిక కాయాలను అంబులెన్స్ సూలూరు ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లు వరుసగా వెళ్తున్న క్రమంలో ముందు ఉన్న వాహనాన్ని వెనక ఉన్న అంబులెన్స్ డీకొట్టింది. కోయింబత్తూర్ మెట్టుపాళాయం దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్‌, పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అంబులెన్స్ గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించి జవాన్ల మృతదేహాలను మరో అంబులెన్స్‌లో తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story