అమెజాన్ కి గ్రీన్ సిగ్నల్.. ఆల్కహాల్ హోం డెలివరీ..

అమెజాన్ కి గ్రీన్ సిగ్నల్.. ఆల్కహాల్ హోం డెలివరీ..
x
Highlights

అమెజాన్ సంస్థ ఇప్పుడు సరికొత్త డెలివరీలోకి ప్రవేశించింది. పశ్చిమ బెంగాల్ లో మద్యం డెలివరీ చేయడానికి క్లియరెన్స్ పొందింది.

అమెజాన్ సంస్థ ఇప్పుడు సరికొత్త డెలివరీలోకి ప్రవేశించింది. పశ్చిమ బెంగాల్ లో మద్యం డెలివరీ చేయడానికి క్లియరెన్స్ పొందింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారం యొక్క ఆన్‌లైన్ రిటైల్ నిర్వహణకు పశ్చిమ బెంగాల్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. అర్హత ఉన్న ఆన్‌లైన్ సంస్థలలో అమెజాన్ కూడా ఉంది. అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి లభించింది. 90 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాల్గవ రాష్ట్రంగా ఉంది.

గత కొన్నేళ్లుగా భారతదేశంలో అమెజాన్ తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తోంది. కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువును ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు సంస్థ విస్తరణలో భాగంగా అమెజాన్ 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం పంపిణీ స్విగ్గి, జొమాటో ద్వారా జరుగుతోన్న సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories