నాని, సుధీర్ బాబు 'V'సినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్‌లో?

నాని, సుధీర్ బాబు Vసినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్‌లో?
x
Nani, Sudheer Babu 'V' Movie
Highlights

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా ఇంద్రగంటి మోహన‌కృష్ణ డైరెక్ష‌న్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'V.

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా ఇంద్రగంటి మోహన‌కృష్ణ డైరెక్ష‌న్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'V. మొద‌ట ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృంధం ప్ర‌య‌త్నాలు చేసింది. క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే థియేట‌ర్స్ మ‌ళ్లి ఎప్పుడు తెరుచుకుంటాయో.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు అనుకొని డిమాండ్ మొద‌లైంది.

ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్ సంస్థ 'V చిత్రంపై అంచనాలను క్యాచ్ చేసుకునేలా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిద‌ని టాక్. ఈ చిత్రం హక్కుల కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 35 కోట్ల రూపాయ‌ల‌ ఆఫ‌ర్ చేసింద‌ని సమాచారం. అంతేకాదు సినిమా హాల్స్ లో కంటే ముందుగానే త‌మ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసుకునేలా నిర్మాత‌ల‌తో సంప్ర‌దింపులు జరుపుతోందట. అతిత్వరలో నాని V సినిమా నిర్మాత‌ల‌తో డీల్ కుదుర్చుకొని ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసే అవకాశం కల్పించబోతోందట ఆమెజ‌న్ సంస్థ.

ఈ సినిమాలో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. నాని సినీ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందించగా.. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. సైరా నరసింహా రెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్ త్రివేది బాణీలు అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories