మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు
x
Highlights

మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల...

మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్‌ నేత ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు.

అలాగే ఉ‍ద్ధవ్‌ కుమారుడు, ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. ఎన్సీపీ సీనియర్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, నవాబ్‌ మాలిక్‌ మైనార్టీ శాఖ, జయంత్‌ పాటిల్‌కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌కు పబ్లిక్‌ వర్స్‌ దక్కింది. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు రావాల్సి ఉంది. (శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలో కీ రోల్‌)

కాగా డిసెంబర్‌ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories