లోక్ సభకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ రాజీనామా

Akhilesh Yadav Resigned As MP
x

లోక్ సభకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ రాజీనామా

Highlights

Akhilesh Yadav: యూపీలో ఈసారి పవర్లోకి వస్తామని ఎంతో ఆశగా ఎదురుచూసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.

Akhilesh Yadav: యూపీలో ఈసారి పవర్లోకి వస్తామని ఎంతో ఆశగా ఎదురుచూసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా ఉన్న అఖిలేశ్, అలాగే పార్టీ మరో ఎంపీ ఆజంఖాన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో లోక్ సభలో వారి బలం ఐదు నుంచి 3 కి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విక్ట‌రీ కొట్టేస్తామ‌న్న ధీమాతో ఎంపీలుగా ఉన్న వారిద్దరూ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. పార్టీ ఓట‌మిపాలైనా వీరిద్ద‌రూ గెలిచారు. దీంతో వారు ఏదో పదవికి రాజీనామా చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే రాష్ట్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న అఖిలేశ్.. అక్కడే మరింత ఫోకస్డ్ గా పనిచేయాలని భావించి చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో మెంబర్ గా ఉండేకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకే అఖిలేశ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories