బీజేపీపై మండిపడ్డ అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: డబుల్ ఇంజన్ ప్రభుత్వం డబుల్ అవినీతికి దారితీసింది.

Sriveni Erugu
Published on: 11 Feb 2022 8:38 AM IST
Akhilesh Yadav Angry with BJP
X

బీజేపీపై మండిపడ్డ అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం డబుల్ అవినీతి కి దారితీసిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. బిజ్నోర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అఖిలేష్. యాదవ్ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం కొత్తగా నిర్మించే పార్లమెంట్​లో ఏ రాజ్యాంగాన్ని తీసుకువస్తారో అన్న సందేహం అంతటా ఉందని అన్నారు. దళితులు అంటే బీజేపీకి చిన్నచూపు ఉందని.. అందుకని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ఎంతో ముఖ్యం అన్నారు అఖిలేష్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story