Akash Missile: పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఆకాశ్.. దాని ప్రత్యేకతలు తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం

Akash missile system is like an iron dome for India telugu news
x

 Akash Missile: పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఆకాశ్.. దాని ప్రత్యేకతలు తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం

Highlights

Akash Missile: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో అవమానభారంతో...

Akash Missile: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో అవమానభారంతో కుమిలిపోయిన పాకిస్తాన్ తిరిగి కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణ ప్రాంతాలపై దాడులతో విరుచుకుపడింది. ఈ దాడులకు తుర్కియే నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులను కూడా ప్రయోగించింది. అయితే వీటిని మార్గమధ్యలోనే మన ఆకాశ్ క్షిపణులు అడ్రస్ లేకుండా చేశాయి.

అకాశ్ అంటే ఏంటి?

ఇది భూతలం నుంచి గగనంలోకి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 30 కిలోమీటర్లు ఉంటుంది. శత్రు క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సత్తా వీటికి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ తో దీన్ని కూడా పోల్చవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

రాడార్లు గగనతలంపై నిఘా పెడుతాయి. ఇతర డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులు వచ్చే దిశ, ఎత్తు..వంటి అంశాలను గమనిస్తాయి. దాదాపు 120కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి. ఆకాశ్ ను రాజేంద్ర అనే రాడార్లు మార్గదర్శకం వహిస్తాయి. ఏదైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్ కు సమాచారామిస్తాయి. అనంతరం ఆకాశ్ క్షిపణి వెళ్లి ఆ వస్తువును కూల్చివేస్తుంది. మార్గమధ్యంలో తన దిశను మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ్ కు ఉంది.

కొత్త తరం ఆకాశ్ కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతనతరం ఆకాశ్ లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించి చేపట్టిన పరీక్షలు కూడా విజయవంతం అయ్యాయి. దీని రేంజ్ ను కూడా 70కిలోమీటర్ల వరకు పెంచనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories