Singer Harini Rao: సింగర్ హరిణి తండ్రి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

AK Rao Death Case: సింగర్ హరిణి రావు తండ్రి ఏకే రావు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు వెలుగుచూశాయి.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 7:03 PM IST
Singer Harini Rao: సింగర్ హరిణి తండ్రి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
X

AK Rao Death Case: సింగర్ హరిణి రావు తండ్రి ఏకే రావు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఏకే రావు మృతిని ఆత్మహత్యగా బెంగుళూరు పోలీసులు తేల్చారు. తీవ్ర రక్తస్రావం, షాక్‌తోనే ఏకే రావు మృతి చెందారన్నారు. ఆత్మహత్యకు ముందురోజు ఏకే రావు కత్తిని కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు కత్తి కొనుగోలు చేసిన షాపు సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ఏకే రావు చేతి మణికట్టుపై స్వల్పంగా కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. కత్తితో ఆత్మహత్య చేసుకొనేందుకు ధైర్యం సరిపోక రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఏకే రావుది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story