ఎయిర్‌‌పోర్టు చుట్టుపక్కల అక్రమనిర్మాణాలపై కేంద్రం దృష్టి.. రూల్స్ అతిక్రమించి కట్టిన భవనాలు కూల్చివేత

Airport Surroundings Illegal Constructions Demolition Rules 2025
x

ఎయిర్‌‌పోర్టు చుట్టుపక్కల అక్రమనిర్మాణాలపై కేంద్రం దృష్టి.. రూల్స్ అతిక్రమించి కట్టిన భవనాలు కూల్చివేత

Highlights

Aviation Rules: ఎయిర్ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అక్రమనిర్మాణాలను వెంటనే కూల్చివేయాలిని కేంద్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Aviation Rules: ఎయిర్ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అక్రమనిర్మాణాలను వెంటనే కూల్చివేయాలిని కేంద్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఎయిర్ పోర్టులో పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని ఉంటే వాటిని రూల్స్ ప్రకారం కూల్చివేయాలనే ఒక ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై ప్రజల సలహాలు, సూచనలు కూడా ఇవ్వమని కోరింది.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రజలు నివసించే ప్రాంతంలో కూలిపోవడం, ఆ ప్రాంతం ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పౌరవిమానయాన శాక, కేంద్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నా, భవనాలు రూల్స్ ని అతిక్రమించి ఎక్కువ ఎత్తులో కట్టినా వాటిపై వెంటనే దృష్టి సారించాలని అధికారులను సూచించింది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను కూడా విడుదల చేసింది.

ఎయిర్ డ్రోమ్ జోన్ల ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా ఎత్తు ఎక్కువగా ఉన్న బిల్డింగుల ఎత్తు తగ్గించేలా, అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 2025 పేరిట ఈ ముసాయిదాను సిద్దంచేశారు. అంతేకాదు ప్రజలకు దీనిపై సూచనలు సలహాలు ఇవ్వాలని కూడా కోరారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు వెళ్లాలి. భవనాల వివరాలు, పర్మిషన్లు, ఎంత ఎత్తులో భవనం ఉంది, నిర్మాన ప్లాన్, సైట్ ప్లాన్ ఇలాంటి వివరాలన్నీ వెంటనే అధికారులకు సమర్పించాలని ఈ నోటీసులో ఉంది. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత సరైన వివరణ ఇవ్వకపోతే రూల్స్ ప్రకారం ఆ నిర్మాణాలను నిర్ధాక్షణంగా కూల్చివేయాలని సంస్థ నిర్ణయించింది. అయితే వివరణ ఇచ్చేందుకు గడువు కోరితే దానికి గడువు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది.

విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలు ఉన్నా, ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఎటువంటి నిర్మాణాలు కట్టినా.. విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో రన్ వే సరిగా కనిపించక పైలెట్ వీటి వల్ల కన్ఫూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories