Air India Express: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

Air India Express: సడెన్‌గా లీవ్ పెట్టడంతో పలు ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 May 2024 11:28 AM IST
Air India Express sacks 30 crew members who went on mass sick leave
X

Air India Express: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

Air India Express: ఎయిరిండియాలో పలువురు ఉద్యోగులు అకస్మాత్తుగా సెలవులపై వెళ్లడంతో ఆ సంస్థ చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సడెన్‌గా లీవ్ పెట్టడంతో పలు ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దయ్యాయి. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న సంస్థ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 30 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. మంగళ, బుధవారాల్లో సిబ్బంది సడెన్ లీవ్ పెట్టడంతో దాదాపు 100 ఫ్లైట్‌లు రద్దవగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. దీంతో 15 వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలిగిన అసౌకర్యానికి తమను క్షమించాలని ప్రయాణికులను కోరింది ఎయిరిండియా సంస్థ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story