Air India: కాసేపట్లో టేకాఫ్‌.. ఇంతలోనే విమానంలో చెలరేగిన మంటలు..

Air India: ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 4:18 PM IST
Air India Express Flight Catches Fire At Muscat Airport
X

Air India: కాసేపట్లో టేకాఫ్‌.. ఇంతలోనే విమానంలో చెలరేగిన మంటలు..

Air India: ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. రన్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మస్కట్‌ నుంచి కొచ్చికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఎయిర్‌పోర్టు అధికారులు ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story