AIADMK: అన్నాడీఎంకేలో రచ్చకెక్కిన ఆధిపత్య రాజకీయాలు

AIADMK: పార్టీ పగ్గాలు తనకే అప్పగించాలంటున్న పనీర్ సెల్వం

Rama Rao
Published on: 22 Jun 2022 5:36 PM IST
AIADMK Leader Ahead Of Party Meet | Tamil Nadu News
X

AIADMK: అన్నాడీఎంకేలో రచ్చకెక్కిన ఆధిపత్య రాజకీయాలు

AIADMK: అన్నా డీఎంకేలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. పార్టీలో ఎవరి ఆధిపత్యం కొనసాగాలన్న విషయంలో రేపు జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించాలని నిర్ణయించారు. దానికి ముందే చెన్నైలోని జయలలిత మెమోరియల్ ముందు పన్నీర్ సెల్వం అనుచరులు పెద్దసంఖ్యలో చేరుకొని పార్టీ పగ్గాలు సెల్వంకే అప్పగించాలని నినాదాలు చేశారు.

జయలలిత తరువాత ఈకే పళనిస్వామి పార్టీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పన్నీర్ సెల్వం ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు. మరోవైపు రేపటి సమావేశానికి పర్మిషన్ ఇవ్వరాదని అటు పోలీసులకు కూడా దరఖాస్తు చేశారు. కానీ పోలీసులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో రేపటి అన్నాడీఎంకే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story