Tamil Nadu: ఓట్ల కోసం బట్టలు ఉతికిన అన్నాడీఎంకే అభ్యర్థి

Aiadmk Candidate Impresses Voters by Washing Cloths
x

తమిళనాడు:(ఫైల్ ిఇమేజ్)

Highlights

Tamil Nadu: అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న తంగకత్తిరవన్‌ అనే అభ్యర్థి ఓ ఇంట్లో బట్టలు ఉతికి అందరినీ ఆశ్యర్యపరిచారు.

Tamil Nadu: ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారంటే ఇదేనేమో...ఎన్నికల సమయంలో ఎన్ని ఫీట్లు, స్టంట్లు వేస్తారో ఈ ఫోటో చూస్తుంటే అర్థం అవుతుంది. తమిళనాడులో ఓ అభ్యర్థి ఓట్లు అడుగుతూ ఓ ఇంటికి వచ్చాడు. అక్కడ ఓ మహిళ దుస్తులు ఉతుకుతుండగా ఆమెకు బదులు అభ్యర్థే ఉతికేశాడు. దీంతో ఆశ్చర్య పోవడం అక్కడి వారి వంతు అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో అన్నాడిఎంకే తరపున పోటీ చేస్తున్న తంగకత్తిరవన్ అనే అభ్యర్థి ఈ పని చేశాడు. ఇంకేముంది ఈ విషయం మీడియా కంట పడింది.

తంగకత్తిరవన్‌ దుస్తులు ఉతుకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అన్నాడీఏంకే మరోసారి అధికారంలోకి వస్తే వాషింగ్‌ మిషన్లను ఇస్తామని ఎన్నికల ప్రాణాళికలో హామీ ఇచ్చింది. ఆ హామీ కచ్చితంగా నెరవేరుస్తామనే ఉద్దేశంతోనే తమ నేత ఇలా బట్టలు ఉతికినట్లు ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రజలకు ఏమి కావాలో ఓట్ల సందర్భంలోనే తెలుస్తాయనుకుంటా ఈ రాజకీయ నాయకులకు. ఓట్ల అనంతరం ప్రజల మోహాలు చూసే వాడు నేడు కరువయ్యారు. కాబట్టి ఓట్లు వేసేపుడు ఆలోచించుకోవాల్సిన అవసరం మనందరి పై వుందనే వాస్తవం.

Show Full Article
Print Article
Next Story
More Stories