AIADMK: చిన్నమ్మ శశికళకు షాకిచ్చిన అన్నాడీఎంకే
AIADMK: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
AIADMK: చిన్నమ్మ శశికళకు షాకిచ్చిన అన్నాడీఎంకే
AIADMK: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలనుకుంటున్న శశికళ ప్రయత్నాలకు అన్నాడీఎంకే అధినాయకత్వం చెక్ పెట్టింది. ఆమె మళ్లీ తిరిగి పార్టీలో చేరకుండా కట్టుదిట్టంగా పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది. జయ మరణం తర్వాత పార్టీకే తామే అన్నీ అయి కీలకంగా వ్యవహరిస్తున్న పళని, పన్నీర్ సర్వాధికారాలు తమదగ్గరే ఉంచుకునేలా పార్టీ బైలాస్ మార్చేశారు.
ఇకపై పార్టీ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వం, జాయింట్ కో ఆర్డినేటర్ గా పళని స్వామి వ్యవహరిస్తారు. పార్టీలో అగ్ర నాయకత్వం ఎంపికకు ఇకపై ఐదేళ్ల పాటూ ప్రాధమిక సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటేసే అధికారం ఉంటుంది. పార్టీలో అత్యున్నత నాయకత్వానికి రెండు పోస్టులు ఉన్నా వారిని ఎన్నుకునేందుకు ఓటు మాత్రం ఒకటే ఉండేలా మార్పులు చేశారు.
Next Story




