Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అమిత్ షా

Jagannath Rath Yatra: అహ్మదాబాద్ లో జరిగే రథయాత్ర హారతి కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

Kranthi
Updated on: 12 July 2021 7:51 AM IST
Amit Shah on the Jagannath Rath Yatra
X

Amit Shah:(Twitter) 

Jagannath Rath Yatra: నేడు పూరీ జగన్నాథ రథయాత్ర జరగనుంది. దానికంటే ముందు గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. అహ్మదాబాద్ లో జరిగే రథయాత్ర ప్రారంభంలో హారతి కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ఆలయంలోని ఏనుగు నుంచి ఆశీర్వాదం పొందారు.

ఈ సమయంలో... ఆయన గజరాజుకు... ఓ చెరుకుగడ అందించారు. దాన్ని వెంటనే నమిలేసిన ఏనుగుకు... మళ్లీ అరటిపండ్లు అందించారు. వాటిని కూడా తీసుకున్న ఏనుగు... ఆనందంగా తినేసింది. ఆ తర్వాత ఏనుగు తలపై చెయ్యి వేసి... సరదాగా నిమిరారు హోం మంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమంలో అమిత్ షాతోపాటూ అధికారులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.


Kranthi

Kranthi

Next Story