Adani-Hindenburg Issue: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Adani-Hindenburg issue: Supreme Court Sets up Expert Committee
x

Adani-Hindenburg Issue: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Highlights

Adani vs Hindenburg: అదానీ, హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది.

Adani vs Hindenburg: అదానీ, హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ సభ్యులుగా గోపీభట్, నందన్ నిలేఖని, కేవీ కామత్, సోమ శేఖర్, జస్టిస్ దేవదత్ ఉన్నారు. సెబీ దర్యాప్తు కూడా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు నెలల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్‌ల బ్యాచ్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories