శివసేనలో చేరిన ఊర్మిళ!

గత ఏడాది 2019 లోక్‌‍సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటి చేసిన ఊర్మిళ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ పార్టీ నేతలు సహకరించడకపోవడం వల్లనే తానూ ఓటమి పాలు అయ్యానని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Krishna
Published on: 1 Dec 2020 3:44 PM IST
శివసేనలో చేరిన ఊర్మిళ!
X

సినీ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మతోండ్కర్‌ శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది 2019 లోక్‌‍సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటి చేసిన ఊర్మిళ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ పార్టీ నేతలు సహకరించడకపోవడం వల్లనే తానూ ఓటమి పాలు అయ్యానని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఊర్మిళ పేరును శివసేన పార్టీ ఖరారు చేసింది. ఈ నేపధ్యంలో ఊర్మిళ శివసేనలో చేరారు. అటు హిందీతో పాటుగా పలు భాషల్లో నటించారు ఊర్మిళ.

Krishna

Krishna

Next Story