Kasthuri: తెలుగు జాతిపై నోరు పారేసుకున్న కస్తూరి కోసం పోలీసుల గాలింపు

Actress Kasthuri: తెలుగు జాతిపై వివాస్పద కామెంట్స్ చేసిన సినీనటి కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2024 1:46 PM IST
Actress Kasthuri Goes Missing After Summons Over Controversial Comments About Telugu Community
X

Kasthuri: తెలుగు జాతిపై నోరు పారేసుకున్న కస్తూరి కోసం పోలీసుల గాలింపు

Actress Kasthuri: తెలుగు జాతిపై వివాస్పద కామెంట్స్ చేసిన సినీనటి కస్తూరి కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. రాజుల కాలంలో అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు జారారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

300 ఏళ్ల క్రితం ఒక రాజు దగ్గర అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే.. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను కస్తూరి పరోక్షంగా ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌ రావడంతో పరారీలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక బ‌ృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story