Gulab Singh: ఆప్ ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ను కొట్టిన కార్యకర్తలు

Gulab Singh: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి.. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు

Jyothi
Published on: 22 Nov 2022 11:38 AM IST
Activists Beat AAP MLA Gulab Singh
X

Gulab Singh: ఆప్ ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ను కొట్టిన కార్యకర్తలు

Gulab Singh: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాద‌వ్‌ను ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన టికెట్ల‌ను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సోమ‌వారం ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అదే సమయంలో ఎమ్మెల్యేతో కార్య‌కర్త‌లు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కాల‌ర్‌ను ప‌ట్టుకుని, లాగేశారు. జ‌నం నుంచి త‌ప్పించుకుని పారిపోతున్న ఎమ్మెల్యేను ప‌ట్టుకుని మ‌రీ పంచ్‌లు విసిరారు. మున్సిప‌ల్ టికెట్లు అమ్మినందుకు సొంతం పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎమ్మెల్యేపై దాడి చేసిన‌ట్లు బీజేపీ ఆరోపిస్తున్నా.. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కొట్టిపారేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story