Delhi Acid Attack: ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

Delhi Acid Attack: నడుచుకుంటూ వెళుతున్న బాలికపై యాసిడ్‌ దాడి

Jyothi
Updated on: 14 Dec 2022 1:56 PM IST
Acid Attack on Student in Delhi
X

Delhi Acid Attack: ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

Delhi Acid Attack: ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్‌ దాడి కలకలం సృష్టించింది. ద్వారక ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న బాలికపై బైక్‌ మీద వచ్చిన ఇద్దరు యువకులు యాసిడ్‌ పోసి పారిపోయారు. యాసిడ్‌ దాడిలో బాలిక ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలికన వెంటనే సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. యాసిడ్‌ పడడంతో బాలిక కళ్లు తెరవలేక పోతోందని, బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉందని పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్‌ పోసిన యువకుల వివరాలు ఇంకా తెలియలేదు.

Jyothi

Jyothi

Next Story