బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ హత్య కేసు నిందితుడు అరెస్ట్

ఎంపీ అజీమ్ అనర్‌ని హనీ ట్రాప్ చేసినట్లు సమాచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2024 5:49 PM IST
Accused Arrested in Bangladesh MP Azim Murder Case
X

బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ హత్య కేసు నిందితుడు అరెస్ట్

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా వచ్చిన ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ వలసదారుడి జిహాద్ హవల్దార్‌ని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సదరు ఎంపీని హనీట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో నిందితులు దారుణంగా వ్యవహరించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి... చర్మాన్ని వలిచేశారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలకు పసుపు రాశారు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్‌లో ఉంచారు. ఇతర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వివిధ ప్రదేశాల్లో పడేసినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story