Gujarat: మేం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారిస్తాం- కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లోని అధికార బీజేపీని ఏకిపారేశారు.

Arun Chilukuri
Updated on: 20 Sept 2022 9:01 PM IST
AAP Will Implement Old Pension Scheme if Elected in Gujarat Says Arvind Kejriwal
X

Gujarat: మేం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారిస్తాం- కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లోని అధికార బీజేపీని ఏకిపారేశారు. బీజేపీ ఏలుబడిలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ గార్డులు, టీచర్లు, హెల్త్ వర్కర్లు, గ్రామ కార్యదర్శులు ఇలా అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల మౌలిక వసతులు కల్పించని బీజేపీ సర్కార్ ను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల కనీస అవసరాలను తీరుస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకే గూటి పక్షులంటూ ఆయన దుయ్యబట్టారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story