Top
logo

దేశవ్యాప్తంగా ఆప్‌ విస్తరణ!

దేశవ్యాప్తంగా ఆప్‌ విస్తరణ!
Highlights

తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నూతన ఉత్సాహంలో ఆ పార్టీ మరో ముందడుగు వేసింది.

తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నూతన ఉత్సాహంలో ఆ పార్టీ మరో ముందడుగు వేసింది. ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఇప్పుడు నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ శుక్రవారం వెల్లడించారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే సానుకూల జాతీయవాదంతో పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తునట్టుగా అయన వివరించారు. ఎవరైనా పార్టీలో చేరాలంటే 9871010101 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వొచ్చని అయన పేర్కొన్నారు.

ఇక ఫిబ్రవరి 16న రాం లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోడీకి గురువారం ఆహ్వానం పంపించినట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అన్నదానిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సింది. ఇక ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేబినేట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక వేడుకకి మరే రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకులను ఆహ్వానించడం లేదని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ముందుగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని ఆప్ భావించింది. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 08స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెర్చుకోలేదు.

Web TitleAAP to contest local body elections across India
Next Story

లైవ్ టీవి


Share it