Aarogya Setu: ఆ రెండు గీతలు కనిపిస్తే.. వ్యాక్సినేషన్ పూర్తయినట్లే..!

Aahrogya Setu App to Displays Covid 19 Vaccination Status will Show as Blue Tick Mark
x

ఆరోగ్య సేతు యాప్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్... దీని గురించి తెలియని వారు ఉండరేమో.

Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్... దీని గురించి తెలియని వారు ఉండరేమో. తొలిదశ కరోనా వ్యాప్తి చెందుతున్న టైంలో ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు మన చుట్టుపక్కల కరోనా కేసులు ఉన్నాయా లేదా అనే విషయాలను సైతం చూపించి అలర్ట్ చేస్తుంది. ఇలా ఈ యాప్ విశేష సేవలంచింది. అలాగే టీకా రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా అందించింది. అయితే, ప్రస్తుతం ఈ యాప్ మరో అప్‌డేట్‌ తో ఆకట్టుకుటుంది.

అయితే ప్రస్తుతం వైరస్​ సమాచారం, టీకా రిజిస్ట్రేషన్​లతో పాటు మరో వ్యక్తి వ్యాక్సినేషన్​ స్టేటస్​ను చూపిస్తోంది. టీకా తీసుకున్న వ్యక్తి పేరు పక్కన ఒక బ్లూ మార్క్ చూపింస్తుంది. అలాగే రెండో టీకా తీసుకుంటే రెండు బ్లూ మార్క్‌లను చూపిస్తుంది. ఇలా రెండు బ్లూ మార్కులు కనిపిస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఈ యాప్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పర్యవేక్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories