logo
జాతీయం

ఇంటి నుంచే ఆధార్ అప్‌డేట్ .. ఎలా చేయాలంటే ?

ఇంటి నుంచే ఆధార్ అప్‌డేట్ .. ఎలా చేయాలంటే ?
X
Highlights

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బయపడుతున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బయపడుతున్నారు. ఇక కొత్త కరోనా స్ట్రెయిన్ రావడంతో జనం బిక్కుక్కుమంటున్నారు. ఏదైనా ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చింది. ఆధార్ లో వ్యక్తిగత సమాచారం పొందుపరచుకోవడానికి ఆధార్ కేంద్రాన్ని సందర్శించకుండా మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, భాషను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు uidai ఒక ట్వీట్‌లో పేర్కొంది.

1: ఆధార్ కార్డ్ యొక్క అధికారిక వెబ్‌సైట్(uidai.gov.in)‌ను సందర్శించండి.

2: మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్'పై క్లిక్ చేయండి.

3: తర్వాత 'ప్రొసీడ్ టూ అప్‌డేట్ ఆధార్'ని ఎంచుకోండి.

4: ఇప్పుడు మీ ఆధార్ ధార్ కార్డు నంబర్‌, కాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి.

5: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

6: ఇప్పుడు మీకు కనిపించే 'అప్‌డేట్ డామోగ్రాఫిక్ డేటా' సెలెక్ట్ చేసుకోండి.

7: తర్వాత ట్యాబ్ లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.

8: ఇప్పుడు పైన చెప్పిన వాటిలో మీరు నవీకరించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి.

9: అన్ని వివరాలను నింపిన తరువాత, ఐడిని అడ్రస్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాలి. దీన్ని ఏ ఫార్మాట్‌లోనైనా పీడీఎఫ్, జేపిఇజి లేదా పీఎన్‌జీలో అప్‌లోడ్ చేయవచ్చు.

10: డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 50 ఆన్‌లైన్ చెల్లించండి.

11: ఆన్‌లైన్ చెల్లింపు విజయవంతం అయ్యాక మీకు వెంటనే నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌కు URN కోడ్ వస్తుంది.

Web TitleAadhar important details online
Next Story