Karnataka: సీఎం బసవరాజు బొమ్మైపై ముద్దుల వర్షం కురిపించిన ఓ మహిళ

Karnataka: బొమ్మై కుడిచేతిని పట్టుకుని ముద్దులు

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 7:21 PM IST
A Woman Kisses Karnataka CM Basavaraj Bommai in Bangalore
X

బసవరాజ్ బొమ్మై చేతుపై ముద్దులు పెట్టిన ఓ మహిళా (యూట్యూబ్ ఇమేజ్)

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు వింత అనుభవం ఎదురైంది. అభిమానంతో ఓ మహిళ బొమ్మైపై ముద్దుల వర్షం కురిపించింది. జనసేవక కార్యక్రమంలో భాగంగా సీఎం బొమ్మై బెంగుళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన సంతోషంలో అక్కడున్న ఓ మహిళ బసవరాజ్ బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టుకుంది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story