నిద్రిస్తున్నవారిపై దూసుకుపోయిన ట్రక్కు: 15 మంది మృతి

K V D Varma
Updated on: 19 Jan 2021 11:32 AM IST
Road accident in Gujarat
X

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం 

గుజరాత్‌లోని కొసంబా జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను, క్షతగాత్రులను రాజస్థాన్‌లోని బన్స్‌వాడ జిల్లాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

వేగంగా వెళ్తున్న ట్రక్కు ఎదురుగా చెరుకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి.. అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లింది. దీంతో 15 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story