సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి షాక్‌.. మంత్రి రాజీనామా

ఢిల్లీ రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా

Shashank Gullapelli
Published on: 10 April 2024 6:13 PM IST
A Shock To CM Kejriwal Government Minister Raaj Kumar Anand Resign
X

సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి షాక్‌.. మంత్రి రాజీనామా

Delhi News: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేశారు. ఆప్‌ నుంచి బయటకు వెళ్తూ ఆ పార్టీపై, సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆమ్‌ ఆద్మీ ‘అవినీతిలో పాలుపంచుకున్న’ పార్టీగా పతనమైందని అన్నారు. ‘అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆప్‌లో చేరాను. నేడు, పార్టీ అవినీతి కార్యకలాపాల మధ్యలో కూరుకుపోయింది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని గిరిజన శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story