కాసేపట్లో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం

A key meeting of the Central Cabinet will be held soon
x

కాసేపట్లో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం

Highlights

మంత్రుల శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ

ప్రధాని మోడీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఏర్పాటైన మోడీ కేబినెట్ తొలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. మోడీతో పాటు 72 మంది మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి పోర్ట్‌ఫోలియోలను తర్వాత ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రిత్వశాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో కేబినెట్ సమావేశం కంటే ముందే శాఖల కేటాయింపు జరగగా... ప్రస్తుతం కేబినెట్ భేటీలో ఎవరికి ఏ శాఖలను కేటాయించాలనే అంశంపై చర్చ జరుగనుంది. కాగా కీలక మంత్రిత్వశాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది. అటు ఏపీకి కేటాయించిన మంత్రి పదవులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories