సాఫ్ట్ బొమ్మలకు మార్కెట్లో ఫుల్ క్రేజ్

సాఫ్ట్ బొమ్మలకు మార్కెట్లో ఫుల్ క్రేజ్
x
Highlights

ముద్దుగా, బొద్దుగా ఉండే టేడ్డీబేర్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి యువత వరకు టేడ్డీబేర్ ని చూడగానే గట్టిగా హత్తుకోవాలనుకుంటారు....

ముద్దుగా, బొద్దుగా ఉండే టేడ్డీబేర్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి యువత వరకు టేడ్డీబేర్ ని చూడగానే గట్టిగా హత్తుకోవాలనుకుంటారు. ఇక చిన్నపిల్లలయితే ఎన్ని బొమ్మలు ఇచ్చినా కాసేపు ఆడి పక్కన పడేస్తారు. కానీ టేడ్డీబే ర్ ను మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. టేడ్డీ బేర్ బొమ్మలు సుతిమెత్తగా ఉంటాయి. వాటి వల్ల పిల్లలకు ఎలాంటి హానీ ఉండదు. వేరే బొమ్మలైతే పిల్లలు గాయపరుచుకునే అవకాశముంది. చిన్నపిల్లల చేతిలో పడిన బొమ్మలకు గ్యారంటీ ఉండదు. ఎప్పుడు విసిరికొడతారో తెలియదు. ఎలా కొరికిపడేస్తారో అర్థం కాదు. అదే టేడ్డీబేర్ తో ఆ టెన్షన్ అవసరం లేదు. అందుకే చాలా మంది పేరెంట్స్ టేడ్డీబేర్ ను పిల్లలకు కొనివ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

టేడ్డీబేర్ బొమ్మలకు ఫుల్ క్రేజ్ ఉండడంతో అదే స్టైల్లో డిఫ్రెంట్ సాఫ్ట్ బొమ్మలు మార్కెట్లోకి వచ్చేశాయి. కోతి, డోనాల్డ్ డక్, పాండా, మిక్కీమౌస్, మిన్ని మౌస్, కుక్క, పిల్లి, సింహం ఇలా అనేక రకాల జంతువులతో పాటు విభిన్న కార్టూన్ క్యారెక్టర్ల రూపాల్లోనూ సాఫ్ట్ బొమ్మలు అందుబాటులోకి వచ్చేశాయి. కొన్ని కంపెనీలయితే ఫోటో ఇస్తే చాలు అచ్చం అలానే డిజైన్ చేస్తున్నారు. బొమ్మకు త్రీడీ ఫొటో ను అమరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా త్రీడీ ఫేస్ డాల్ మేకింగ్ మెషీన్ ని రూపొందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories