మధ్యప్రదేశ్ మాండ్విలో బోరుబావిలో పడ్డ బాలుడు

* ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన 8ఏళ్ల తన్మయ్.. జేసీబీతో సమానంగా గుంతను తవ్వుతున్న అధికారులు

R Tripura Malini
Published on: 7 Dec 2022 8:53 AM IST
A Boy Fell Into A Borewell In Mandvi Madhya Pradesh
X

మధ్యప్రదేశ్ మాండ్విలో బోరుబావిలో పడ్డ బాలుడు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా మాండ్విలో ఆడుకుంటూ 8ఏళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. బాలుడిని క్షేమంగా వెలికితీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో బోరుబావికి సమానంగా అధికారులు గుంతను తవ్విస్తున్నారు. బాలుడుకి ఆక్సిజన్ అందటానికి బోరుబావిలోకి సిబ్బంది ఆక్సిజన్ పైపును పంపారు. బాలుడు బోరుబావిలో స్మృహ తప్పి పడిపోయాడని అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. కాగా, బాలుడు ఎంత లోతులో ఉన్నాడని విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story