Punjab: పంజాబ్ సీఎం ఇంటి దగ్గర బాంబు

Punjab: బాంబును స్వాధీనం చేసుకున్న పోలీసులు

Dhatripriya
Updated on: 2 Jan 2023 6:18 PM IST
A Bomb Exploded Near Punjab CM House
X

Punjab: పంజాబ్ సీఎం ఇంటి దగ్గర బాంబు

Punjab: పంజాబ్‌లో ఉగ్రకుట్ర భగ్నం చేశారు. పంజాబ్ సీఎం ఇంటి దగ్గర పోలీసులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. దీంతో భగవంత్‌సింగ్ మాన్ ఇంటి దగ్గర భారీగా భద్రత పెంచారు. లైవ్ బాంబు దొరికిన సమయంలో సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరని తెలుస్తోంది. చండీఘడ్‌లో సీఎం భగవంత్ మాన్ నివాసానికి 500 మీటర్ల దూరంలోని హెలిప్యాడ్ వద్ద లైవ్ బాంబు లభించిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం భగవంత్ మాన్ నివాసానికి దారితీసే అన్ని మార్గాల్లోని సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story