Ration: త్వరలో రేషన్ నిబంధనలలో మార్పులు.. కొత్త రూల్స్ ఏంటంటే..?

A big Change in the Rules for Taking Ration From Government Shops Know the New Rules
x

Ration: త్వరలో రేషన్ నిబంధనలలో మార్పులు.. కొత్త రూల్స్ ఏంటంటే..?

Highlights

Ration: మీకు రేషన్‌కార్డు ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.

Ration: మీకు రేషన్‌కార్డు ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. త్వరలో ప్రజాపంపిణీ శాఖ రేషన్ కార్డు నిబంధనలను మారుస్తోంది. అర్హుల నిబంధనలలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త ప్రమాణాల ముసాయిదా దాదాపుగా సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో పలు దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ రేషన్ నిబంధనల్లో మార్పులు చేయడానికి సిద్దమైంది. వాస్తవానికి కొత్త నిబంధనలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. తద్వారా ఎటువంటి గందరగోళం ఉండదు.

కొత్త చట్టాల కోసం గత కొన్ని నెలలుగా రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖ చెబుతోంది. రాష్ట్రాలు ఇచ్చే సూచనలను పరిగణలోనికి తీసుకొని కొత్త చట్టాలని సిద్ధం చేస్తున్నట్లు చెబుతోంది. ఇవి త్వరలోనే అమలులోకి రానున్నాయి. కొత్త చట్టాల అమలు తర్వాత అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. అనర్హులు ప్రయోజనం పొందలేరు. అవసరార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేస్తున్నారు.

ఒకే దేశం,ఒకే రేషన్ కార్డు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఇప్పటి వరకు 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ (ONORC) పథకం' డిసెంబర్ 2020 వరకు 32 రాష్ట్రాలు, యుటిలలో అమలు అవుతుంది. దాదాపు 69 కోట్ల మంది లబ్ధిదారులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చే జనాభాలో 86 శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి నెలా దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories