దారుణం.. ఒకే కుటుంబంలో 9 మంది బలవన్మరణం..

Sangli: మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 20 Jun 2022 4:57 PM IST
9 Members Of Family Found Dead At Home In Maharashtra Sangli
X

దారుణం.. ఒకే కుటుంబంలో 9 మంది బలవన్మరణం..

Sangli: మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో 9 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. మేము ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలను కనుగొన్నాము. మూడు మృతదేహాలు ఒకే చోట, ఇతర వేర్వేరు ప్రదేశాలలో ఆరు మృతదేహాలు ఇంట్లో లభ్యమయ్యాయి అని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story