Corona Cases In India: భారత్‌లో కొత్తగా 819 కోవిడ్‌ కేసులు

Corona Cases In India: అత్యధికంగా కర్ణాటకలో 279 మందికి పాజిటివ్‌

Jyothi
Published on: 10 Jan 2024 12:31 PM IST
819 New Covid Cases in India
X

Corona Cases In India: భారత్‌లో కొత్తగా 819 కోవిడ్‌ కేసులు

Corona Cases In India: దేశవ్యాప్తంగా కోవిడ్‌ విస్తరిస్తోంది. భారత్‌లో రోజు రోజుకు కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4వేల 49కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతిచెందగా.. ఇప్పటివరకు కోవిడ్‌ నుంచి 889 మంది కోలుకున్నారు.

JN-1 సబ్‌ వేరియంట్ కారణంగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య క్రమంగా పెరగడం పట్ల ప్రజల్లో భయాందోళన మొదలైంది. అంతేకాదు.. చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్‌ మరింత విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తు్న్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story