7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో కనీస వేతనాలు పెరిగే అవకాశాలు..!

7th Pay Commission Big Update Increase the Fitment Factor of Central Government Employees
x

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో కనీస వేతనాలు పెరిగే అవకాశాలు..!

Highlights

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు పెంచాలని చాలా కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు పెంచాలని చాలా కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పలు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. ఆ తర్వాత కనీస మూల వేతనాన్ని పెంచుతుందనే అంచనాలు పెరిగాయి. కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే.. ఉద్యోగుల జీతం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కింద 2.57 శాతం జీతం లభిస్తుండగా అది 3.68 శాతానికి పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగుల కనీస వేతనం దాదాపు రూ.8,000 పెరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కి పెరగనుంది. ప్రస్తుతం కనీస మూల వేతనం రూ.18,000 ఉండగా దానిని రూ.26000కు పెంచాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మీ కనీస వేతనం రూ. 18,000 అయితే అలవెన్సులు మినహాయించి, మీరు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ. 46,260 (18,000 X 2.57 = 46,260) పొందుతారు. కేంద్ర మంత్రివర్గం జూన్ 2017లో 34 సవరణలతో ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆమోదించింది. ఎంట్రీ లెవల్ బేసిక్ పేని నెలకు రూ.7,000 నుంచి రూ.18,000కు పెంచగా, అత్యున్నత స్థాయి అంటే సెక్రటరీకి రూ.90,000 నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. క్లాస్ 1 అధికారులకు ప్రారంభ వేతనం రూ.56,100గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories