అహా అమ్మాయి అనుకున్నాడు.. కట్ చేస్తే రూ.5లక్షలకు బుక్కయ్యాడు..

Mumbai: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో చెలరేగిపోతున్నారు.

Jyothi
Updated on: 29 April 2023 8:31 PM IST
71 Yr Old Man Falls For Beautiful Girls For Enjoyment Message Loses ₹5 Lakh In Mumbai
X

అహా అమ్మాయి అనుకున్నాడు.. కట్ చేస్తే రూ.5లక్షలకు బుక్కయ్యాడు..

Mumbai: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహా మోసంతో చెలరేగిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేస్తూ వీక్ పాయింట్ మీద కొడుతూ డబ్బులు దోచుకుంటున్నారు. స్పియర్ ఫిషింగ్, వేల్ ఫిషింగ్ లతో కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అందమైనా అమ్మాయిల ఫోటోలను ఎరాగా వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. బయటకు చెబితే ఎక్కడ పరువు పోతుందని చాలా మంది తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో యువకులే కాదు వృద్ధులు కూడా ఉంటున్నారు. తాజాగా ముంబైలో ఓ వృద్ధుడు ఏకంగా రూ 5లక్షలు పోగొట్టుకున్నాడు.

ముంబైలోని సమతానగర్ లో 71 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. భార్య చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతడి ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయిలతో గడపాలనుకుంటన్నారా..ఈ నంబర్ కు కాల్ చేయండి అని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చూసి టెంప్ట్ అయిన వృద్ధుడు వెంటనే ఆ నంబర్ కు కాల్ చేశాడు. అవతరి నుంచి ఓ వ్యక్తి మాట్లాడాడు. కొంతమంది అమ్మాయిల ఫోటోలను పంపించి నచ్చిన వారిని సెలక్ట్ చేసుకోమన్నాడు. అయితే సెలక్ట్ చేసుకునేముందు రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.2000 చెల్లించాలని చెప్పాడు. జస్ట్ రూ.2000 కదా రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాడు. ఇక ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ ముసలాయన వద్ద నుంచి రూ.5లక్షల వరకు పిండేశారు. అక్కడితో ఆగకుండా మళ్లీ డబ్బులు పంపించాల్సింది అడిగారు.

ఇలా పలు మార్లు డబ్బులు గుంజడంతో ముసలాయనకు అసలు విషయం బోధపడింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ముసలాయన బయటపడ్డాడు కానీ, ఇలా మోసపోతున్నవారు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలతో సెక్స్ టాక్ చేయొచ్చని, ఎంజాయ్ చేయొచ్చని భావిస్తే ఏ క్షణంలో అయినా ఇరుక్కుపోవడం ఖాయం..కాబట్టి ఇలాంటి మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story