కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో 8 మంది మృతి.. మృతులంతా తెలంగాణ వారుగా గుర్తింపు

Karnataka: కమలాపురంలో జీపును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం

Rama Rao
Updated on: 3 Jun 2022 1:38 PM IST
7 Dead As Bus Catches Fire In Karnatakas Kalaburagi | Live News
X

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు

Karnataka: విహారయాత్ర విషాదమైంది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కళ్ల ముందే అయినవాళ్లు అగ్నికి ఆహుతయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు టెంపోను ఢికొట్టంది. కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లా కమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. తర్వాత బస్సు రోడ్డుపక్కన వంతెనను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో బస్సుకు మంటలంటుకున్నాయి.

క్షణాల్లో బస్సు తగలబడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వాళ్లను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్‌తో పాటు 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులంతా తెలంగాణ వారుగా గుర్తించారు. పుట్టిన రోజు వేడుకల కోసం మే 29న హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లారు. అనంతరం తిరుగు ప్రమయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

టెంపోను ఢీకొట్టిన తర్వాత బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 8మంది సజీవదహనమయ్యారు. సంఘటన స్థలంలో నలుగురు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మరో ముగ్గురు మృతిచెందారు. చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. తమ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నా ఏం చేయలేక చూస్తుండిపోయారు.


Rama Rao

Rama Rao

Next Story