Corona Cases in India: దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Jun 2021 9:22 AM IST
62,224 New Corona Cases Reported in India on 16th June 2021
X

Corona Cases in India: దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు

Corona Cases in India: దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గత 12రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతున్నా కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి వస్తున్నాయి.

భారత్ లో కొత్తగా 62వేల 224 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 542 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 7వేల 628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 83లక్షల 88వేల 100 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8లక్షల 65వేల 432 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 96లక్షల 33వేల 105కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 26,19,72,014 డోసులు వేసినట్లు వివరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story