పిల్లల కోసం రెండో పెళ్లి.. ఆయనకు 62, ఆమెకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు

62 Year Old Becomes Father Of Triplets After His Wife Convinces Him For Second Marriage In Madhya Pradesh
x

పిల్లల కోసం రెండో పెళ్లి.. ఆయనకు 62, ఆమెకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు

Highlights

Madhya Pradesh: 62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు.

Madhya Pradesh: 62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా (62) కొంతకాలం క్రితం హీరాబాయి కుష్వాహా (30)ను రెండో వివాహం చేసకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చగా సోమవారం రాత్రి హీరాబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు సిజేరియన్‌ చేసి ప్రసవం చేశారు. హీరాబాయి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులు కాస్త బలహీనంగా ఉండటంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గోవింద్‌ మొదటి భార్య కస్తూరిబాయి వయసు 60 ఏళ్లు. ఈ దంపతుల కుమారుడు 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ కారణంగా కస్తూరిబాయే దగ్గరుండి మరీ తన భర్తకు రెండో వివాహం జరిపించింది. పెళ్లయిన ఆరేళ్లకు హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories