Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్, కరోనా కేసులు

భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్, కరోనా కేసులు
Corona Cases in India:నగరాల్లో ఎక్కువగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
Corona Cases in India: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఎనిమిది రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 6.3 రెట్లు పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 58వేల 97 కేసులు నమోదయ్యాయి. నగరాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వస్తున్న కేసుల్లో అత్యధికం ఒమైక్రాన్‌వేనని ఇప్పటిదాకా 2వేల135 ఒమైక్రాన్ కేసులను గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సి పనిలేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని సూచించింది. మూడోవేవ్ ముప్పును సమర్థంగా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేసింది. జనవరి 4న వరల్డ్ వైడ్‌గా 25.2 లక్షల కేసులు నమోదయ్యాయని కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ 20న దేశంలో 58వేల, 419 కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆ తర్వాత 58 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
దేశంలో ఇప్పటిదాకా 3కోట్ల, 50లక్షల, 18వేల, 358 మంది వైరస్ బారిన పడినట్టయిందని కేంద్రప్రభుత్వం తెలిపింది. 81 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు పైగా నమోదయ్యాయని పేర్కొంది. ఇప్పటిదాకా దేశంలో 2వేల,135 ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఒమిక్రాన్ బారిన పడినవారిలో 828 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 653 ఒమైక్రాన్ కేసులను గుర్తించగా ఢిల్లీలో 464, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 154, తమిళనాడులో 121 కేసులు వచ్చినట్టు వివరించింది. ఇక మహారాష్ట్రలో ఒక్క బుధవారమే 26వేల, 538 కేసులు, ఢిల్లీలో 10వేల,665 కేసులు నమోదయ్యాయి.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Revanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMTఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMT