Corona Cases in India: దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 10:19 AM IST
53,256 New Corona Cases Reported in India on 21st June 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా దేశంలో 53వేల 256 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,422 మంది మృతి చెందారు. ఏప్రిల్ 17 తరవాత మరణాల్లో ఈ స్థాయి తగ్గుదల తొలిసారి నమోదైంది. కొత్తగా 78వేల 170 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది.

ఇందులో 2,88,44,199 మంది బాధితులు కోలుకోగా, 3,88,135 మంది మహమ్మారి వల్ల మరణించారు. మరో 7,02,887 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోపక్క నిన్న 30,39,996 మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు టీకా తీసుకొన్న వారి సంఖ్య 28కోట్లకు చేరింది. కరోనా టీకా కార్యక్రమం కింద ఈ రోజు నుంచి 18 ఏళ్లు పైడిన వారికి కూడా ఉచితంగా టీకా పంపిణీ జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story