జమాత్ కార్యక్రమానికి హాజరైన 51 ఏళ్ల కరోనా రోగి మృతి

జమాత్ కార్యక్రమానికి హాజరైన 51 ఏళ్ల కరోనా రోగి మృతి
x
Highlights

గత ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన 51 ఏళ్ల COVID-19 పాజిటివ్ రోగి శనివారం తమిళనాడులో కన్నుమూశారు.

గత ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన 51 ఏళ్ల COVID-19 పాజిటివ్ రోగి శనివారం తమిళనాడులో కన్నుమూశారు. ఇప్పటికే రాష్ట్రంలో 411 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి, వాటిలో 364 మంది తబ్లిఘి జమాత్ హాజరయ్యారు. కాగా దేశవ్యాప్తంగా 12 గంటల్లో 601 తాజా ప్రాణాంతక కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, శనివారం ఉదయం భారతదేశం ఇప్పటివరకు అత్యధిక స్పైక్ నమోదు చేసింది, ఈ కేసులతో దేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 2,902 కు చేరుకుంది. కాగా మార్చిలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో హాజరయ్యారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అనేక కొత్త వైరస్ సంక్రమణ కేసులను నివేదించాయి, ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ సంఘటన కారణంగా ఈ సంఖ్యలు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరోవైపు జమాత్ కార్యక్రమానికి హాజరైన మరో 15 మంది ఏపీ వాసులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

దాంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి చేరింది. ఇక తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్లే నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 93 కేసులు నమోదయ్యాయి, అందులో 77 మంది జమాత్ కార్యక్రమానికి వేలి వచ్చారు.

అలాగే మహారాష్ట్రలో మొత్తం 67 కేసులు నమోదయ్యాయి, ఇందులో ముగ్గురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, అదేవిధంగా, కేరళలో గత 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి వీటిలో ఏడు కేసులు తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరయ్యాయిన వారు ఉన్నారు.

దేశంలోని తాజా కేసులు 90 శాతం జమాత్ కార్యక్రమానికి హాజరైన వాళ్ళకే రావడంతో గత రెండు రోజుల కిందట కేంద్ర హోమ్ శాఖ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిపై దృష్టి సారించింది. వారిని జల్లెడ పడుతోంది. ఇవాళ లేదంటే మరో రోజులో వీరందరిని ట్రేస్ చేసే అవకాశం ఉంది. దీంతో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories