మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం.. ఇద్దరు మంత్రులతో సహా 50 మందికి పాజిటివ్

మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం.. ఇద్దరు మంత్రులతో సహా 50 మందికి పాజిటివ్
Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా విరుచుకుపడుతోంది. డిసెంబర్ 22న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అయితే ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 50 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని తెలిపారు. మంత్రులు వర్ష గైక్వాడ్, కేసీ పాడ్వి వైరస్ బారిన పడ్డారు.
వీరితో పాటు శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహా సర్కారు.. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...
28 May 2022 2:17 AM GMTనిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMT