ఎయిమ్స్‌లో 480మంది సిబ్బందికి కరోనా

ఎయిమ్స్‌లో 480మంది సిబ్బందికి కరోనా
x
Highlights

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది...

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో 480 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇందులో 19 మంది డాక్టర్లు ఉండగా, 38 నర్సులు, 14 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. 19 డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా, మిగిలినవారు రెసిడెంట్‌ డాక్టర్లు. కరోనాతో ఈ అత్యున్నత ఆస్పత్రిలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్‌ శానిటేషన్‌ సిబ్బందికి ఇన్‌చార్చి ఉన్నారు. మరొకరు ఆస్పత్రి మెస్‌లో పనిచేసే ఉద్యోగి. ఇలా కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైరద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories