Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 47,638 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 6 Nov 2020 11:28 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 47,638 కరోనా పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in India : భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దేశంలో కేసుల సంఖ్య 84 లక్షల 11 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 47,638 కేసులు నమోదు కాగా, 670 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 54,157 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 84,11,724 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,20,773 ఉండగా, 77,65,966 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,24,985 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 92.32 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.19 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story