భారత్‌లో కొత్త‌గా 46,253 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 4 Nov 2020 11:06 AM IST
భారత్‌లో కొత్త‌గా 46,253 కరోనా పాజిటివ్ కేసులు
X

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 83 లక్షల 13 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 46,253 కేసులు నమోదు కాగా, 514 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 53,357 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 83,13,876 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,33,787 ఉండగా, 76,56,478 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,23,611 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 92.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.42 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story