భారత్‌లో కొత్త‌గా 45,148 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 26 Oct 2020 10:18 AM IST
భారత్‌లో కొత్త‌గా 45,148 కరోనా పాజిటివ్ కేసులు
X

India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 79 లక్షల 09 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 45,148 కేసులు నమోదు కాగా, 480 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 73,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 79,09,959 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,717 ఉండగా, 71,37,228 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,19,014 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.23 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.26 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 9,39,309 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,34,62,778 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story