Corona Cases in India: గడిచిన 24గంటల్లో 45,083 మందికి పాజిటివ్

Corona Cases in India: * దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు * కరోనాతో మరో 460 మంది మృతి

Shireesha
Published on: 29 Aug 2021 11:20 AM IST
45,083 New Coronavirus Cases Reported in India Today 29 08 2021 | Today Corona Cases in India
X

గడిచిన 24గంటల్లో 45,083 మందికి పాజిటివ్

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 45 వేల 83 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు దాటింది. మరోవైపు. కరోనాతో మరో 460 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4 లక్షల 37 వేలు దాటింది. క్రీయాశీల కేసులు ఒక్క రోజులో 8 వేల 783 పెరిగాయి. దీంతో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 3 లక్షల 68 వేల 558 ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. తాజాగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదు అయ్యాయి. కేరళలో రికార్డు స్థాయిలో 31 వేల 265 కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 35 వేల 840 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3 కోట్లు దాటింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు ప్రస్తుతం 97.53 శాతం ఉంది.. గత 65 రోజులుగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.28 శాతం కంటే తక్కువగా నమోదు అయింది.. గత 34 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3శాతం కంటే తక్కువగా నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 73.8 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

Shireesha

Shireesha

Next Story